తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటరు నమోదు ప్రక్రియలో గ్రాడ్యుయేట్లకు ఉపశమనం కలిగించేలా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి కీలకమైన ప్రకటన చేశారు. ఓటర్ల నమోదు కోసం ఉద్దేశించిన ఫారమ్-18 దరఖాస్తు గడువుతో సంబంధం లేకుండా, ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ వరకు అర్హులైన గ్రాడ్యుయేట్లు అందరూ తమ ఓటును నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. గత రెండు రోజులుగా ఓటరు నమోదుకు సంబంధించి సీఈఓ.