Hyundai Creta 2027: హ్యుందాయ్ క్రెటా ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. థర్డ్ జెనరేషన్ క్రెటా SUV భారత్‌లో తన చివరి దశ టెస్టింగ్‌లో బిజీగా ఉంది. గతంలో దేశ విదేశాల్లో పలుమార్లు కనిపించిన ఈ కారు, తాజాగా మరోసారి స్పై షాట్స్‌లో చిక్కింది. ఈసారి గుర్గావ్ (ఎన్సీఆర్) తో పాటు మంచు కొండల మనాలీలో ఈ టెస్ట్ మోడల్స్ కనిపిస్తాయి. విశేషమేమిటంటే, ఈసారి కనిపించిన వేరియంట్లలో ఒక బేస్ వేరియంట్, అలాగే డిజిల్ వర్షన్ ఉన్నాయి. మనాలీలో సంచరించిన ఈ కారు నుంచి వచ్చిన ఇంజిన్ సౌండ్ ఆధారంగా అది డీజెల్ వర్షన్ అని స్పష్టమైంది.