Sarfaraz Khan: టీమిండియాలో మళ్లీ చోటు దక్కించుకోవాలని ఎదురుచూస్తున్న టీమిండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్తో జరగనున్న టెస్టు సిరీస్కు ముందు భారత్-A జట్టును ప్రకటించగా.. అందులో తనకు చోటు దక్కకపోవడంపై తాజాగా స్పందించాడు. జట్టు ఎంపిక జరిగిన ప్రతిసారీ తనకు ఆశలు ఉంటాయని.. అయితే, తుది నిర్ణయం సెలెక్టర్ల చేతుల్లోనే ఉంటుందని చెప్పుకొచ్చాడు. తన పని క్రికెట్ ఆడటమేనని స్పష్టం చేశాడు. తనను భారత పరిస్థితుల్లో ఆడటానికి మాత్రమే.