మధ్యప్రదేశ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో విదర్భ యువ స్పిన్నర్ హర్ష్ దూబే అద్భుత ప్రదర్శనతో సంచలనం సృష్టించాడు. ప్రత్యర్థి జట్టుపై ఏకంగా 9 వికెట్లు (9/53) పడగొట్టి అజేయ రికార్డును తన పేరున రాసుకున్నాడు. విదర్భ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణంకాలు నమోదు చేసిన బౌలర్‌గా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు 1967 నుంచి అరుణ్ ఓగిరాల్ పేరిట ఉండేది. సరిగ్గా 59 ఏళ్ల నాటి ఈ పాత రికార్డును హర్ష్ దూబే బద్దలు కొట్టడం.