AP Municipal Elections Results 2026 Live Updates: ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల కౌటింగ్ మొదలయింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. బ్యాలెట్లలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. రీపోలింగ్ సెంటర్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెల్లడికానున్నాయి. 13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు కౌంటింగ్ స్టార్టయ్యింది. మధ్యాహ్నానికి కౌంటింగ్ ట్రెండ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. రాత్రికి పూర్తి ఫలితాలు వెల్లడి.