Bhuvneshwar Kumar: న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో భువనేశ్వర్ కుమార్ ఘోరంగా విఫలమయ్యాడు. నాలుగు మ్యాచ్ల్లో 16 ఓవర్లు వేసి 180 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. టీ20 అంతర్జాతీయ సిరీస్లో అత్యంత చెత్త బౌలింగ్ సగటు నమోదు చేశాడు. ముఖ్యంగా రెండో, మూడో, నాలుగో ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇర్ఫాన్ పఠాన్ కూడా అతడి ఎంపికపై ప్రశ్నలు లేవనెత్తాడు.