ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసైన్డ్, చుక్కల, ఇనాం, పట్టా భూములకు సంబంధించి ఫ్రీహోల్డ్ దరఖాస్తుల పరిష్కారంపై కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు, భూ యజమానుల సుదీర్ఘకాల సమస్యలకు వేగంగా పరిష్కారం చూపేందుకు స్పష్టమైన మార్గదర్శకాలతో జీవో నంబర్ జారీ చేసింది. ఈ నూతన జీవో ఉత్తర్వుల ప్రకారం.. ఫ్రీహోల్డ్ కోసం వచ్చే దరఖాస్తులను తహసీల్దార్ స్థాయి నుంచి రెవెన్యూ డివిజనల్ అధికారి పరిధి వరకు గరిష్టంగా 60 రోజుల వ్యవధిలోనే తప్పనిసరిగా పరిష్కరించాల్సి ఉంటుంది. అలాగే నిషేధిత భూముల జాబితా.