కృత్రిమ మేధస్సు (AI), డీప్‌ఫేక్ టెక్నాలజీ పేరుతో సెలబ్రిటీల పరువు తీస్తూ, అసభ్యకరంగా వీడియోలను మార్ఫింగ్ చేస్తున్న ఆకతాయిల ఆట కట్టించేందుకు మెగాస్టార్ చిరంజీవి సమరశంఖం పూరించారు. ఇటీవల ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఈ పైశాచిక ఆనందంపై తీవ్ర స్థాయిలో మండిపడిన ఆయన.. కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా ఏకంగా కేంద్ర ప్రభుత్వం వద్దకే ఈ పంచాయితీని చేర్చడం ఇప్పుడు సంచలనంగా మారింది. హైదరాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా సమావేశమయ్యారు..