Tollywood: సినిమా పరిశ్రమలో విజయం ఉన్నంతవరకే ఎవరికైనా విలువ. ఒక్క శుక్రవారం తలరాతను మార్చేస్తుందనే పాత నానుడి నేటి డిజిటల్, పాన్-ఇండియా యుగంలో దర్శకుల విషయంలో మరింత కఠినంగా నిజమవుతోంది. నిన్నటి వరకు ఇండస్ట్రీని షేక్ చేసిన మేకర్స్ అయినా, వందల కోట్ల రికార్డులను తిరగరాసిన దిగ్గజాలైనా.. బాక్సాఫీస్ వద్ద ఎదురయ్యే ఒకే ఒక్క పరాజయం వారి కెరీర్ను ఒక్కసారిగా సందిగ్ధంలో పడేస్తోంది. స్టార్ హీరోల కాల్షీట్లు, భారీ నిర్మాణ సంస్థల అండ ఉన్నప్పటికీ.. ఫలితం తేడా.