విజయవాడ నగర ఓటర్లు తమ హక్కును వినియోగించుకునేందుకు అసలు ఆసక్తి చూపించలేదు. నగరపాలక ఎన్నికల్లో ఓటింగ్ శాతం భారీగా తగ్గిపోయింది. ఈనాడు, అమరావతి: - న్యూస్టుడే, నగరపాలక సంస్థ: విజయవాడ నగర ఓటర్లు తమ హక్కును వినియోగించుకునేందుకు అసలు ఆసక్తి చూపించలేదు. కేవలం 55.35 శాతానికి ఈసారి ఓటింగ్ పరిమితమైంది. 2021లో 63.02 శాతం ఓటింగ్ నగరంలో నమోదైంది. ఈసారి ఏకంగా 7.67 శాతం ఓటింగ్ తగ్గిపోయింది. సగం మంది ఓటేసేందుకు కూడా ఇళ్లలో నుంచి బయటకు రాలేదు. గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ కేంద్రాల కష్టాలు కూడా లేవు.