విజయవాడలో ప్రైవేట్ కోవిడ్ సెంటర్‌గా నిర్వహిస్తున్న హోటల్ స్వర్ణ ప్యాలస్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మొత్తం 11 మంది చనిపోయారని ఆంధ్రప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జయరామ్ నాయక్ ఆదివారం చెప్పారు. మృతుల సంఖ్య 10 మందేనని విజయవాడ నగర పోలీసు కమమిషనర్ బి శ్రీనివాసులు సోమవారం నాడు బీబీసీకి చెప్పారు. ప్రమాద సమయంలో ఒక వ్యక్తి ఆచూకీ తెలియకపోవటంతో మరణించినట్లు పరిగణించామని.. ఆ వ్యక్తి ఆచూకీ తర్వాత తెలిసిందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరించారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది గాయపడ్డారు.