మురసు తుపాను నేపథ్యంలో విజయవాడ విమానాశ్రయం నుంచి 12 సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ఇండిగో విమానయాన సంస్థ ప్రకటించింది. ఈసందర్భంగా హైదరాబాద్, విశాఖ, బెంగళూరు, చెన్నై, ముంబయి, తిరుపతి, కర్నూలు వెళ్లే విమానాలను రద్దు చేసింది. ఈ తుపాను దృష్ట్యా విమానాల రాకపోకలకు అంతరాయం కలగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అలాగే హైదరాబాద్, విశాఖకు వెళ్లే విమానాలను ఎయిరిండియా రద్దు చేసినట్లు ప్రకటించింది. విజయవాడ నుంచి 12 విమాన సర్వీసులు రద్దు |.