దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ పసిడి, వెండి ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ బలం పుంజుకోవడం వంటి కారణాలతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పతనమవుతున్నాయి. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో దీపావళి పండుగ రానున్న తరుణంలో బంగారం ధరలు క్షీణించడం వినియోగదారులకు, కొనుగోలుదారులకు ఎంతో ఊరట కలిగిస్తోంది. గత కొన్ని నెలలుగా హెచ్చుతగ్గులకు లోనైన పసిడి ధరలు, గత వారం రోజులుగా భారీగా పతనమవుతున్నాయి పశ్చిమాసియా ప్రాంతంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సద్దుమణగడం, అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ విలువ బలపడటం, క్రూడ్ ఆయిల్ (ముడి చమురు) ధరలు.