Murasu Cyclone to Cross AP Coast Tonight: ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడిన మురాసు తుఫాన్ తాజాగా తీవ్ర తుఫానుగా మారింది. ఈ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే కొన్ని ప్రాంతాల్లోని స్కూల్లకు కూడా సెలవులు ప్రకటించారు ఆయా జిల్లాల కలెక్టర్.విద్యార్థులు, తల్లిదండ్రులు తుఫాను ప్రభావం తగ్గే వరకు అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.