Rapthadu Girl Attack Case: రాప్తాడు బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన కేసులో నిందితుడు హేమంత్పై పోలీసులు కాల్పులు జరిపారు. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై కత్తితో దాడికి యత్నించడంతో ఈ చర్య తీసుకున్నట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. గాయపడిన హేమంత్‌ను అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయినా సరే ఎవ్వరూ అతడిపై జాలి చూపడంలేదు. ఎలక్ట్రిక్ రంపంతో బాలికపై విరుచుకుపడ్డ తీరు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. ఇప్పుడా బిడ్డ కొనఊపిరితో బెంగళూరు ఆస్పత్రిలో పోరాటం చేస్తోంది. త్వరగా కోలుకోవాలని, ఆనరరూప రాక్షసుడ్ని కఠినాతి కఠినంగా శిక్షించాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు.