EPFO WhatsApp Service Launched: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన కోట్లాది మంది సభ్యులకు మరో కీలక డిజిటల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై PF సభ్యులు EPFO వెబ్సైట్లో లాగిన్ అవ్వాల్సిన అవసరం లేకుండా WhatsApp ద్వారానే తమ PF ఖాతా బ్యాలెన్స్, ఇటీవల జరిగిన లావాదేవీలు, పాస్బుక్ వివరాలను తెలుసుకునే అవకాశం కల్పించారు. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ కొత్త డిజిటల్ సేవను ప్రారంభించారు. EPFO.