వరంగల్లో 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి త్వరలోనే అందుబాటులోకి రానుంది. సేవలను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈనాడు, వరంగల్: వరంగల్లో 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇంత పెద్దాసుపత్రిలో గుండె చికిత్సల విభాగం ఏర్పాటుపై స్పష్టత లేదు. ఇక్కడ కొత్తగా ఈ విభాగాన్ని ఏర్పాటు చేస్తారా? కాకతీయ వైద్య కళాశాల(కేఎంసీ)లో పీఎంఎస్ఎస్వై పథకంలో భాగంగా కొనసాగుతున్న గుండె చికిత్సల విభాగాన్ని ఇక్కడికి మారుస్తారా? కేఎంసీలో శస్త్రచికిత్సలు ఆగిపోవడంతో పేద, మధ్యతరగతి వాళ్లు ప్రైవేటును ఆశ్రయిస్తున్నారు. ఓపీ సేవలు కూడా వారంలో పూర్తిగా ఉండటం లేదు.