ఆంధ్రప్రదేశ్‌లో మునిసిపల్/స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. విజయవాడ 55వ వార్డులో సాంకేతిక కారణాల వల్ల దాదాపు రెండున్నర గంటలు పోలింగ్ ఆలస్యంగా ప్రారంభం కావడంతో పోలింగ్ సమయాన్ని రాత్రి 7:30 గంటల వరకు పొడిగించినట్లు వెల్లడించారు. పల్నాడు, అనంతపురం జిల్లాల్లో జరిగిన సంఘటనలపై పీవో రిపోర్టు ఆధారంగా రీపోలింగ్‌పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.