హైదరాబాద్లో మరోసారి రాజ్, సిమ్రన్ ప్రేమకథ సందడి చేయనుంది. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన సూపర్ హిట్ సినిమా ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’ (DDLJ) ప్రత్యేక ప్రదర్శనలకు సిద్ధమైంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ సినిమా హైదరాబాద్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రదర్శితం కానుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. . సాధారణంగా హైదరాబాద్లో టాలీవుడ్ హీరోల పుట్టినరోజులకు అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తుంటారు. థియేటర్ల దగ్గర కటౌట్లు ఏర్పాటు చేసి, ప్రత్యేక షోలు వేస్తూ సందడి చేస్తుంటారు.