SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్న వాళ్లకు చేదు వార్త. కార్డుతో భారీగా పెట్రోల్ కొట్టించినా, పెద్ద మొత్తంలో టికెట్ బుకింగ్స్ చేసినా ఇకపై అదనంగా ఛార్జీలు వసూలు చేయాలని ఎస్బీఐ కార్డ్ నిర్ణయించింది. ఈ కొత్త ఫీజు రూల్స్ 2026 డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు అక్టోబర్ 27న కంపెనీ అధికారికంగా నోటీసు ఇచ్చింది. తాజా రూల్స్ ప్రకారం.. ఒక నెల బిల్లింగ్ సైకిల్లో పెట్రోల్, డీజిల్ కోసం.