ఆంధ్రప్రదేశ్లో ముగిసిన మొదటి విడత పట్టణ స్థానిక సంస్థల (మున్సిపల్) ఎన్నికల ప్రక్రియపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికార వ్యవస్థలను, పోలీసు యంత్రాంగాన్ని, చివరకు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (SEC) కూడా దుర్వినియోగం చేస్తూ ఎన్నికలను 100 శాతం అక్రమంగా నిర్వహించారని ఆరోపించారు. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్షాలను భయాందోళనలకు గురిచేస్తూ, ప్రజాస్వామ్యాన్ని దారుణంగా హత్య చేశారని మండిపడ్డారు. 1500 మందికి.