దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మహదేవ్ ఆన్లైన్ బుక్’ అక్రమ బెట్టింగ్ సిండికేట్ ప్రధాన ప్రమోటర్ సౌరభ్ చంద్రకార్ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విజయవంతంగా భారత్కు రప్పించింది. ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థల సమన్వయంతో ఒమన్ సుల్తానేట్ నుంచి అతడిని అప్పగించే ప్రక్రియను పూర్తి చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒమన్ వెళ్లిన సీబీఐ బృందం నిందితుడిని భారత్కు తీసుకొచ్చింది. సౌరభ్ చంద్రకార్పై ఇప్పటికే సీబీఐ రెండు కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేయగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).