సీనియర్ సిటిజన్లు తమ పదవీ విరమణ కోసం డబ్బులు పొదుపు చేసుకోవాలని అనుకుంటుంటారు. అలాంటివారి కోసం కేంద్ర ప్రభుత్వం ఒక పొదుపు పథకం తీసుకొచ్చింది. అదే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్. ఈ పథకం కింద ఎలా పెట్టుబడి పెట్టాలనేది చూద్దాం. సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే పథకాన్ని అమలు చేస్తోంది. రిటైర్మెంట్ చేసిన వయో వృద్దులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఒక అద్బుతమైన పొదుపు పథకం అందుబాటులోకి తెచ్చింది. కేవలం సీనియర్ సిటిజన్లు మాత్రమే ఇందులో పెట్టుబడానికి అర్హత లభిస్తుంది. ఇందులో డబ్బులు పొదుపు చేసుకుంటే స్థిరమైన ఆదాయం లభిస్తుంది.