విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పురిటిపెంటలో బంగారం మెరుగు పెడతామంటూ ఇద్దరు వ్యక్తులు ఓ మహిళను మోసం చేశారు. ఆభరణాలను శుభ్రం చేస్తామని నమ్మించి రెండున్నర తులాల బంగారు తాడును అపహరించారు. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. అపరిచితులకు బంగారు ఆభరణాలు అప్పగించవద్దని హెచ్చరిస్తున్నారు. కాలేజీ సమీపంలో ఓ మహిళను ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మాటల్లో పెట్టారు. బంగారు ఆభరణాలకు మెరుగు పెడతామంటూ ఆమెను నమ్మించారు. మహిళ దృష్టి మరల్చి రెండున్నర తులాల బంగారు తాడు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.