యావత్ దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో జరిగిన ఘటన. పదో తరగతి విద్యార్థినిపై జరిగిన ఈ క్రూరమైన దాడి ఘటనపై సామాన్యులు, రాజకీయ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ ఘటనపై డైరెక్టర్ వేణు ఊడుగుల సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడులోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై జరిగిన దాడి ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఓ ఉన్మాది క్లాస్ రూంలోకి చొరబడి రంపంతో విద్యార్థినిపై దాడి చేశాడు.