తెలంగాణలో సన్న బియ్యం ధరల నియంత్రణకు ప్రభుత్వం గరిష్ఠ రిటైల్ ధరలను ఖరారు చేసింది. బీపీటీ, కేఎన్ఎం బియ్యం కిలో రూ.66, తెలంగాణ సోనా, ఆర్ఎన్ఆర్ రూ.74, హెచ్ఎంటీ, జేఎస్ఆర్ రూ.79గా నిర్ణయించింది. ఈ ధరల కంటే ఎక్కువకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ హెచ్చరించింది. దుకాణాల్లో ధరల పట్టిక ప్రదర్శన తప్పనిసరి చేసింది. హైదరాబాద్: తెలంగాణలో బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. నాణ్యమైన మేలు రకం సన్న బియ్యం కేజీ రూ.100 వరకు అమ్ముతున్నారు. దీనిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్ అయింది..