టాలీవుడ్లో చైల్డ్ ఆర్టిస్టులతో పని చేయించుకునే వ్యవహారంపై తెలంగాణ కార్మిక శాఖ సీరియస్ యాక్షన్‌కు దిగింది. తాజాగా ‘ఇరుముడి’ సినిమా నిర్మాతలకు లేబర్ డిపార్ట్మెంట్ ఊహించని షాక్ ఇస్తూ సంచలన నోటీసులు జారీ చేసింది. ఈ సినిమా షూటింగ్‌తో పాటు, ప్రమోషనల్ ఈవెంట్స్‌లో ఒక మైనర్ బాలికను విరివిగా వాడుకోవడంపై అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాల్లో చిన్న పిల్లలతో నటించేటప్పుడు పాటించాల్సిన బాల కార్మిక చట్టాలను ఉల్లంఘించారనే అనుమానంతో అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు..