విశాఖ జిల్లా ఆనందపురం మండలంలోని గంభీరం ఐఐఎం రోడ్డులో ఉన్న శ్రీ రాధా మదనమోహన్ స్వామి ఆలయంలో శనివారం సాయంత్రం దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆనందపురం: విశాఖ జిల్లా ఆనందపురం మండలంలోని గంభీరం ఐఐఎం రోడ్డులో ఉన్న శ్రీ రాధా మదనమోహన్ స్వామి ఆలయంలో శనివారం సాయంత్రం దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించారు. విశాఖ జిల్లా హరే కృష్ణ మూమెంట్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నిష్కించన భక్తదాస దామోదర ఈ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమాలు నవంబరు 24 వరకు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.