ముఖంపై ముడతలు రాకుండా ఉండాలని చాలామంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సీరమ్స్, సన్‌స్క్రీన్ ఇలా ఎన్నో రకాల స్కిన్ కేర్ ఉత్పత్తులు ఉపయోగిస్తుంటారు. కానీ అదే సమయంలో మెడను మాత్రం చాలామంది పట్టించుకోరు. దీంతో వయసు పెరిగే కొద్దీ మెడపై ముడతలు, అడ్డంగా గీతలు కనిపించడం మొదలవుతుంది. కొందరిలో చిన్న వయసులోనే ఈ గీతలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా రోజులో ఎక్కువ సమయం మొబైల్, ల్యాప్‌టాప్ చూస్తూ గడిపేవారిలో మెడపై మడతలు మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది.