సోదరి పెళ్లికి హాజరుకావాలన్న ఓ యువకుడికి ఊహించని కష్టం ఎదురైంది. స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఓ ఏజెంట్‌ను నమ్మి డబ్బులు చెల్లించాడు. కానీ ఆ ఏజెంట్ మోసం చేయడంతో నాలుగు నెలలుగా దుబాయ్ జైలులో మగ్గుతున్నాడు. జార్ఖండ్‌కు చెందిన తమ కుమారుడిని విడిపించి భారత్‌కు తీసుకురావాలని తండ్రి కేంద్రాన్ని వేడుకున్నారు. సోదరి పెళ్లి కోసం స్వదేశానికి జార్ఖండ్‌లోని పలాము జిల్లాకు చెందిన శశి కుమార్ పాస్వాన్ (23) 2025లో దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఓ ప్రైవేట్ కంపెనీలో కాంట్రాక్టు ఉద్యోగిగా చేరాడు. జూన్ 26న అతడి సోదరి వివాహం నిశ్చయమైంది.