భాగ్యనగరంలో హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలపై టీజీ సేఫ్ అధికారులు కొరడా ఝళిపించారు. ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా గోల్కొండ, చార్మినార్ జోన్ల పరిధిలోని 22 రెస్టారెంట్లు, ఫుడ్ సంస్థల్లో ఏకకాలంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్: భాగ్యనగరంలో హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలపై టీజీ సేఫ్ (TG SAFE) అధికారులు కొరడా ఝళిపించారు. మొత్తం 22 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టగా.. నిబంధనలు ఉల్లంఘించిన 14 రెస్టారెంట్ల FSSAI లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేశారు. తక్షణమే వ్యాపార కార్యకలాపాలు నిలిపివేయాలని వారికి ఆదేశాలు జారీ చేశారు.