అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన ఉన్మాది దాడి ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. పాఠశాల ఆవరణలోనే విద్యార్థినిపై దాడి జరగడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించి, సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించి.. జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులు, విద్యాశాఖ అధికారులతో మాట్లాడారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన అనంతరం, ఆమెకు మరింత మెరుగైన.