సినిమా ఇండస్ట్రీలో కొందరు నటీనటులు చిన్న వయసులోనే మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. వరుస సినిమాలు, టీవీ షోలతో ప్రేక్షకులకు దగ్గరవుతారు. అయితే కెరీర్ మంచి స్థాయిలో ఉన్నప్పుడే అనూహ్యంగా సినిమాలకు దూరమై మరో రంగంలో స్థిరపడిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఒకప్పటి పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ హెచ్.ఎస్. కీర్తన ఒకరు. బాలనటిగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈమె.. 32 సినిమాలు, 48 టెలివిజన్ షోలలో భాగమైన ఆమె ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. కర్ణాటకలోని తుమకూరు జిల్లా హోసకేరె గ్రామంలో జన్మించిన హెచ్.ఎస్. కీర్తనకు చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉండేది.