సినిమా ఇండస్ట్రీలో అందం, అభినయంతో గుర్తింపు తెచ్చుకునే హీరోయిన్లు కొందరైతే.. గ్లామర్‌తో పాటు స్పెషల్ సాంగ్స్ ద్వారా భారీ క్రేజ్ సంపాదించుకునే భామలు మరికొందరు. ముఖ్యంగా ఒకప్పుడు హీరోయిన్గా సినిమాలు చేసినప్పటికీ, ఆ తర్వాత ఐటమ్ సాంగ్స్‌తో ప్రేక్షకులకు మరింత దగ్గరైన నటీమణులు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా ఒకరు. సినిమాల కంటే ప్రత్యేక పాటలు, గ్లామరస్ లుక్స్, సోషల్ మీడియా పోస్టులతో ఎక్కువగా వైరల్ అవుతుంది. ఊర్వశి రౌటేలా పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది ఆమె గ్లామరస్ లుక్స్. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ, అందాల పోటీల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.