Anantapur: అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం పాశవిక ఘటన చోటు చేసుకుంది. విద్యార్థుల సందడితో కళకళలాడే పాఠశాల ప్రాంగణం ఒక్కసారిగా కేకలతో హోరెత్తింది. తరగతి గదిలో విద్యార్థులంతా పాఠాలు వింటున్న సమయాన, ఓ ఉన్మాది హఠాత్తుగా స్కూల్ ఆవరణలోకి చొరబడ్డాడు. పదో తరగతి చదువుతున్న ఓ బాలికని లక్ష్యంగా చేసుకుని, చెక్క మొద్దులు కోసే పదునైన ఎలక్ట్రిక్ రంపంతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. ఆ ఆగంతకుడు బాలిక గొంతును దారుణంగా కోసేశాడు. ఆ బాలిక తీవ్ర రక్తస్రావంతో పాఠశాల ప్రాంగణంలోనే కుప్పకూలిపోయింది.