సైబర్ నేరగాళ్లకు అక్రమ సొమ్మును దారిమళ్లించేందుకు అమాయకుల పేరిట ‘మ్యూల్’ బ్యాంకు ఖాతాలను సమకూరుస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ఆటను హైదరాబాద్ పోలీసులు కట్టడి చేశారు. చార్మినార్ జోన్ కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్, అత్తాపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన మెరుపు దాడిలో ముగ్గురు కీలక నిందితులు పట్టుబడగా, రాజస్థాన్‌కు చెందిన మరో ఇద్దరితో పాటు స్థానిక నిందితులు పరారీలో ఉన్నారు. ఒక్కో ఖాతా రూ.25 వేలకు విక్రయం హుస్సేనీ ఆలం షాగంజ్ ప్రాంతానికి చెందిన సయ్యద్ అబ్బాస్ ఉల్లా హుస్సేనీ.