తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా దీపావళి పండుగ వేళ టమాటా, ఉల్లిపాయలతో సహా పలు నిత్యావసర కూరగాయల ధరలు పడిపోవడంతో సామాన్యులకు ఎంతో ఉపశమనం లభించింది. హైదరాబాద్, గుంటూరు రైతు మార్కెట్లలో ధరల వివరాలు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా దీపావళి పండుగ వేళ ధరలు దిగిరావడం సామాన్యులకు ఎంతో మేలు చేకూరుస్తోంది. ఉల్లి, టమాటాలతో పాటు పలు ఇతర కూరగాయల ధరలు మొన్నటివరకు ఎగబాకగా.. దీపావళి పండుగ రానుండటంతో ఇంటి ఖర్చు పెరుగనుంది. ఈ క్రమంలో కూరగాయల ధరలు దిగి రావడం శుభవార్తగా చెప్పవచ్చు.