మన శరీరంలో మూడింట రెండు వంతులు నీరే ఉంటుంది. కాబట్టి రోజంతా తగినంత నీరు తాగడం ఆరోగ్యానికి చాలా అవసరం. అయితే ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో నీళ్లు తాగే అలవాటు మన శరీరానికి ఎన్నో రకాల అద్భుత ప్రయోజనాలను అందిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే కలిగే ఆరోగ్య లాభాలేంటో వివరంగా తెలుసుకుందాం.. శరీరం రీహైడ్రేట్ అవుతుంది: రాత్రంతా 7-8 గంటలు నిద్రపోతున్న సమయంలో మనం నీటిని తీసుకోము. దీనివల్ల ఉదయానికి శరీరం కొంతవరకు నిర్జలీకరణానికి గురవుతుంది.