సమోసా తినేటప్పుడు పక్కన ఇచ్చే ఎర్రటి చట్నీ, మోమోస్తో పాటు వచ్చే కారం చట్నీని చూడగానే చాలామందికి తినాలనిపిస్తుంది. ఆహారాన్ని ఆకర్షణీయంగా చూపించేందుకు కొందరు విక్రేతలు ఎక్కువగా రంగులు కలుపుతుంటారు. అయితే ఆ రంగులు తినడానికి సురక్షితమైనవేనా? అవి ఆహారంలో ఉపయోగించేందుకు అనుమతి ఉన్నవేనా? అనే విషయాలను చాలామంది పట్టించుకోరు. ముఖ్యంగా ఆహారం కోసం కాకుండా వస్త్రాలు, కాగితాలకు రంగులు వేయడానికి ఉపయోగించే పారిశ్రామిక రసాయనాలను ఆహారంలో కలపడం ఆరోగ్యానికి ప్రమాదకరం.