కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న కీలక రైల్వే ప్రాజెక్టులు, నూతన లైన్ల మంజూరు, హైస్పీడ్ రైలు కారిడార్ల నిర్మాణంపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ సుమారు 360 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు ప్రతిపాదనల సరసన, అదే మార్గంలో రీజినల్ రింగ్ రైలు అలైన్మెంట్ పూర్తిచేసి మంజూరు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు.