విదేశాల్లో ఉద్యోగాల పేరుతో అమాయక నిరుద్యోగులకు వల వేసి లక్షల రూపాయలు కాజేస్తున్న ఘరానా మోసాన్ని కేపీహెచ్బీ పోలీసులు రట్టు చేశారు. మలేషియాలో డేటా ఎంట్రీ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి విదేశాల్లో నరకం చూపించిన ‘బెల్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్’ కన్సల్టెన్సీకి చెందిన నిందితులు బల్లె నరేష్, జగవీర పిల్లెలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా నిందితుడు బల్లె నరేష్, బాధితుడైన బాలగంగాధర రావుకు పరిచయమయ్యాడు. మలేషియాలో నెలకు మంచి వేతనంతో కూడిన ఉద్యోగం ఉందని నమ్మించి,.