ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో ‘పుష్ప’ సినిమా ఎంతటి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకోవడమే కాకుండా, దేశవ్యాప్తంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2021లో విడుదలైన ‘పుష్ప: ది రైజ్’ కథ, కథనం, అల్లు అర్జున్ నటన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇలా అన్ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు దేశవ్యాప్తంగా సెన్సేషన్‌గా మారాయి. వాటిలో సమంత చేసిన ‘ఊ అంటావా మావా..