ప్రస్తుతం స్మార్ట్‌వాచ్‌లు మన దైనందిన జీవితంలో భాగమైపోయాయి. గుండె వేగం ఎంత ఉంది? ఎన్ని అడుగులు నడిచాం? ఎంతసేపు నిద్రపోయాం? రక్తంలో ఆక్సిజన్ స్థాయి ఎంత ఉంది? ఇలా అనేక ఆరోగ్య వివరాలను స్మార్ట్‌వాచ్‌లు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాయి. దీంతో చాలామంది తమ ఆరోగ్య పరిస్థితిపై ఒక అంచనాకు వస్తున్నారు. అయితే స్మార్ట్‌వాచ్‌లో హార్ట్‌బీట్ సాధారణంగా కనిపిస్తే స్ట్రోక్ వచ్చే ప్రమాదం లేదని భావించడం పొరపాటేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 29న ప్రపంచ స్ట్రోక్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. స్ట్రోక్ లక్షణాలపై ప్రజల్లో అవగాహన పెంచడం, సకాలంలో చికిత్స పొందేలా ప్రోత్సహించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.