జీవీఎంసీ అనకాపల్లి జోన్ పరిధిలో ఒక్కో అభ్యర్థి మూడు వార్డుల్లో ప్రచారం చేయాల్సి వస్తోంది. 108, 109 వార్డుల నుంచి పోటీ చేస్తున్న వారికి అవస్థలు తప్పడం లేదు. అనకాపల్లి, న్యూస్టుడే: జీవీఎంసీ అనకాపల్లి జోన్ పరిధిలో ఒక్కో అభ్యర్థి మూడు వార్డుల్లో ప్రచారం చేయాల్సి వస్తోంది. అనకాపల్లి జోన్లో ఇప్పటివరకు ఐదు వార్డులు ఉండేవి. ఈ ఎన్నికల్లో వీటి సంఖ్య ఆరుకు పెరిగింది. ఈ మేరకు వార్డుల పునర్విభజన చేయడంతో వార్డుల హద్దులు మారిపోయాయి. గతంలో గవరపాలెంలో నివసించిన అనేక మంది పట్టణంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకుని అక్కడకు వెళ్లిపోయారు.