బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం తుపానుగా మారుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 31 నాటికి ఇది వాయుగుండంగా బలపడనుంది. తుపానుగా మారుతుందా లేదా అన్నదానిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. Visakhapatnam: మరో తుపాను ముప్పు | there-are-signs-that-another-cyclone. ఈనాడు, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం తుపానుగా మారుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోపక్క అర్నబ్ తుపాను వాయుగుండంగా మారి గురువారం సాయంత్రానికి ఉత్తర ఛత్తీస్గఢ్, దాన్ని ఆనుకొని ఉన్న వాయవ్య ఒడిశా వైపు పయనించి అల్పపీడనంగా బలహీనపడింది. గురువారం ఉదయానికి దక్షిణ అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది.