మహిళల దేశవాళీ టీ20 మ్యాచ్‌లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా ఢిల్లీ ప్రపంచ రికార్డు సృష్టించింది.... పుణె: మహిళల దేశవాళీ టీ20 మ్యాచ్‌లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా ఢిల్లీ ప్రపంచ రికార్డు సృష్టించింది. సీనియర్ మహిళల టీ20 ట్రోఫీలో భాగంగా గురువారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్లకు 262 పరుగుల రికార్డు స్కోరు చేసింది. తనీషా సింగ్ (47 బంతుల్లో 119) వేగవంతమైన శతకం సాధించింది. ఛేదనలో హైదరాబాద్ 154/8 స్కోరు మాత్రమే చేసింది. దీంతో ఢిల్లీ 108 పరుగుల తేడాతో విజయం సాధింది.