ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో నీటి పొదుపును ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. గురువారం జలమండలి ప్రధాన కార్యాలయంలో నీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రూపొందించిన పానీ మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు. పానీ యాప్ ఆవిష్కరణ సిటీబ్యూరో: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో నీటి పొదుపును ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గడం, సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు పడిపోవడంతో వచ్చే జనవరి నుంచి ఆగస్టు వరకు సుమారు 100 ఎంజీడీల నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి అన్నారు.