ఎల్నినో నేపథ్యంలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు హైదరాబాద్ నగర ప్రజలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ప్రధానంగా మంజీర, సింగూరు జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. telangana news: భాగ్యనగరానికి తాగునీటి ముప్పు | drinking-water-crisis-looms-over-the-hyderabad. తొమ్మిది నియోజకవర్గాల్లో తీవ్రమయ్యే అవకాశం మంజీరా, సింగూరు జలాశయాలు అడుగంటడమే కారణం ప్రత్యామ్నాయంగా ఎల్లంపల్లి నుంచి సరఫరాకు ఏర్పాట్లు పైపులైన్ల అనుసంధానానికి యుద్ధప్రాతిపదికన కసరత్తు ఈనాడు, హైదరాబాద్ . నగరంలోని ఎక్కువ ప్రాంతాల్లో మంజీర పైపులైన్లు విస్తరించి ఉండటంతో దాదాపు తొమ్మిది కీలక నియోజకవర్గాల ప్రజలు నీటిఎద్దడిని ఎదుర్కొనే అవకాశాలు కన్పిస్తున్నాయి.