OTR: పంచేసుకున్నారా….? వాళ్ళిద్దరూ షేర్ చేసుకున్నారా? బావా బావమరుదులు ఇద్దరూ…. నీకది, నాకిది అంటూ ఒక అవగాహనకు వచ్చేశారా? కేటీఆర్, హరీష్‌రావు మధ్య ఏ విషయంలో అండర్స్టాండింగ్ కుదిరిందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి? ప్రస్తుత పరిస్థితుల్లో అది వర్కౌట్ అయ్యే అవకాశం ఎంత?. తెలంగాణలో మరో ఎన్నికల సందడి మొదలైంది. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్లకు ఎలక్షన్ టైం దగ్గర పడుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు దీన్ని సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ప్రతిపక్షం బీఆర్ఎస్… రెండు నియోజకవర్గాల.