సుత్తీ కొడవలికి క్లారిటీ వచ్చేసింది. మరి కంకీ కొడవలి సంగతేంటి? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరో దారి వెదుక్కుంటారా? ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్కు దగ్గరైన సీపీఎం ఇప్పుడెందుకు కలిసి రావడం లేదు? మిత్రపక్షం కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు విషయంలో సీపీఐ ఇంకా ఎందుకు నానుస్తోంది? వాళ్ల లెక్కలు వేరే ఉన్నాయా? అదే నిజమైతే… ఆ కేలిక్యులేషన్స్ ఏంటి? తెలంగాణలో పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన చర్చల్లో కొత్త కొత్త అంశాలు తెర మీదికి వస్తున్నాయి..